అల్లరి నరేష్ ఇంకా భయపడుతున్నాడా ?

అల్లరి నరేష్ ఇంకా భయపడుతున్నాడా ?

Published on Dec 10, 2016 6:15 PM IST

intlodeyam-nakem-bayam

అల్లరి నరేష్ సినిమాలంటే ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కి మినిమమ్ గ్యారెంటీ అనే పేరుండేది. ఆ పేరుకు తగ్గట్టే ఆయన కూడా ఏ స్టార్ హీరో సినిమా ఉన్నా సరే సంవత్సరానికి అరడజను పైగా సినిమాలన్నీ రిలీజ్ చేసేవాడు. చిన్న నిర్మాతలంతా నరేష్ తో సినిమా చేస్తే సేఫ్ అనే భావనతోనే ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమవసరం బాక్సాఫీస్ దగ్గర ఆయన సినిమా సందడి బాగా తగ్గింది. కేవలం ఒకే ఒక్క సినిమా ‘సెల్ఫీ రాజా’ మాత్రమే ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకురాగా ఆయన తాజాగా జి. నాగశ్వర రెడ్డి డైరెక్షన్లో చేసిన హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’ పూర్తైనా ఇంకా విడుదలకు నోచుకోలేదు.

ఎప్పుడో నవంబర్ కు ముందే షూట్ పూర్తి చేసుకుని, ట్రైలర్లుకూడా రిలీజ్ చేసి నవంబర్ లోనే సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. కానీ కరెన్సీ బ్యాన్ వచ్చి ఆ ప్లాన్ ని పాడు చేసింది. దాంతో నరేష్ సినిమా అన్ని సినిమాలతో పాటే కాస్త వెనక్కు తగ్గింది. కానీ కొన్ని రోజులకు తేరుకుని ‘ఎక్కడికిపోతావు చిన్నవాడ, సాహసం శ్వాసగా సాగిపో, ధృవ’ వంటి డైరెక్ట్ సినిమాలు ‘భేతాళుడు, మన్యం పులి’ వంటి డబ్బింగ్ చిత్రాలు రిలీజై మంచి ఫలితాలనే అందుకుంటున్నా నరేష్ చిత్రం మాత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. నరేష్ సినిమా కాస్త బాగుందన్న టాక్ వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించడం ఖాయం. అయినా కరెన్సీ బ్యాన్ భయమో లేకపోతే వేరే ఇతర కారాణాలున్నాయో తెలీదు కానీ నరేష్ టీమ్ మాత్రం సినిమాలు రిలీజ్ చేయడానికి వెనకాడుతూనే ఉంది. ఈ భయాలన్నీ పోయి ఆ హర్రర్ కామెడీ సినిమా జనాల్ని భయపెట్టి నవ్వించేది ఎప్పుడో మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు