ఇంటర్వ్యూ: ‘ఆకాంక్ష సింగ్’ – నాకు కథ, నా పాత్ర నచ్చితే చాలు !

ఇంటర్వ్యూ: ‘ఆకాంక్ష సింగ్’ – నాకు కథ, నా పాత్ర నచ్చితే చాలు !

Published on Sep 20, 2019 8:55 PM IST

మళ్లీ రావా సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది ‘ఆకాంక్ష సింగ్’. ఆ తరువాత వైజయంతి మూవీస్ పతాకం అశ్వినిదత్ నిర్మించిన దేవదాస్ చిత్రంలో నాగార్జున సరసన కథానాయికగా నటించి మెప్పించింది. ఇక ఇటివలే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘ప‌హిల్వాన్‌’ చిత్రంలోనూ నటించి తన నటనతో ఆకట్టుకుంది. కాగా తాజాగా ‘ఆకాంక్ష సింగ్’ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘మళ్లీ రావా’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఎలా ఉంది మీ జర్నీ ?

రీసెంట్ గా ‘ప‌హిల్వాన్‌’లో హీరోయిన్ గా చేశాను. ప్రస్తుతానికి జర్నీ అయితే సాఫీగా సాగుతుంది. ఇప్పటివరకు అయితే అన్ని మంచి క్యారెక్టర్సే మంచి సినిమాలే చేశాను. ఇక ముందు కూడా మంచి సినిమాలే చెయ్యాలని కోరుకుంటున్నాను.

 

‘మళ్లీ రావా’ చిత్రానికి బెస్ట్ డెబ్యూ హీరోయిన్ అవార్డు అందుకున్నారు. ఎలా అనిపించింది ?

‘మళ్లీ రావా’ సినిమాకి మొత్తం నాలుగు శాఖల్లో అవార్డులు వచ్చాయి. నాకు బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా అవార్డు రావడం చాల సంతోషాన్ని ఇచ్చింది. నిజంగా ఆ సినిమా నా మనసుకు బాగా దగ్గరైన సినిమా. అలాంటి సినిమాకి అవార్డు రావడం, పైగా నాకు రావడం ఎప్పటికి మరిచిపోలేను.

 

‘ప‌హిల్వాన్‌’ చిత్రంలో మీకు అవకాశం ఎలా వచ్చింది ?

ఆ సినిమా దర్శకుడు ఎస్‌.కృష్ణగారు ఆయన రాసుకున్న కథకు నేను అయితే బాగుంటుందని ఆయన ఫీల్ అయ్యారు. ఆయన నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడే ఈ క్యారెక్టర్ లో మీరు అయితేనే బాగుంటుందని అన్నారు. కథ విన్నాక నాకు నేనే చెయ్యాలి అనిపించింది. అందుకే వెంటనే ఆ సినిమా ఒప్పేసుకున్నాను.

 

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తో కలిసి నటించారు. ఎలా ఉంది ఆయనతో వర్క్ ఎక్స్ పీరియన్స్ ?
అద్భుతంగా అనిపిచింది. సుదీప్ గారు పెద్ద స్టార్. అయినా చాల సింపుల్ గా ఉంటారు. తోటి నటీనటులకు ఆయన చాల బాగా సపోర్ట్ చేస్తారు. సెట్ లో నాకు యాక్టింగ్ పరంగా ఆయన చాల బాగా హెల్ప్ చేశారు.

మీరు పెళ్లి అయ్యాక హీరోయిన్ అయ్యారు కదా ?

పెళ్లి అయ్యాక హీరోయిన్ అయ్యానని అందరు ఆశ్చర్యంగా అడుగుతున్నారు. నటి ఎప్పుడైనా నటినే కదా. నా భర్త నాకు చాల బాగా సపోర్ట్ చేస్తారు. ఆయన సపోర్ట్ వల్లే నేను ఇండస్ట్రీలో రాణించగలుగుతున్నాను.

 

ఇంతకీ మీకు పెళ్లి ఎప్పుడు అయింది ?

నేను టీనేజ్ లోనే ప్రేమలో పడ్డాను. 20 ఏళ్ల వయసులోనే ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్నాను. పైగా నా భర్త సపోర్ట్ తోనే నటనలో శిక్షణను తీసుకొని నటిగా మారాను.

 

‘మళ్లీ రావా’ తరువాత ఎందుకు తెలుగులో ఎక్కువ సినిమాలు చెయ్యలేకపోయారు ?

తమిళ్ కన్నడ సినిమాలు ఒప్పుకోవడం వల్ల కుదరలేదు. కానీ నాగార్జునగారితో కలిసి దేవదాస్ సినిమాలో నటించాను కదా.

 

ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు ?

తెలుగు తమిళంలో సినిమాలు చేస్తున్నాను. ఏ బాష అయినా.. చేసే క్యారెక్టర్ ముఖ్యం. పాత్ర నచ్చితే ఎలాంటి పాత్ర, ఏ బాష అని ఆలోచించను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు