కళ్యాణ్ రామ్ సినిమాలో ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని పాట !

కళ్యాణ్ రామ్ సినిమాలో ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని పాట !

Published on Jan 19, 2018 5:35 PM IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ఒకటి ‘నా నువ్వు’. జయేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ఒక ముఖ్యమైన పాట చిత్రీకరణలో ఉంది. ఈ పాట సినిమాకే ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు. అంతేగాక సినిమాటోగ్రఫర్ పిసి. శ్రీరామ్ కెమెరా వర్క్, బృందా మాస్టర్ కొరియోగ్రఫీ కలిసి పాటను ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని విధంగా, కొత్తగా తయారుచేశాయని సినీ సన్నిహిత వర్గాలు ద్వారా తెలుస్తోంది.

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కు జోడీగా తమన్నా నటిస్తోంది. పూర్తిస్థాయి ప్రేమ కథగా ఉందనున్న ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, కూల్ బ్రీజీ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీంతో పాటే కళ్యాణ్ రామ్ నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ జోడీగా ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ అనే సినిమాలో సైతం నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు