‘భలే భలే మగాడివోయ్’కి అల్లు అర్జున్ బెస్ట్ విషెస్

‘భలే భలే మగాడివోయ్’కి అల్లు అర్జున్ బెస్ట్ విషెస్

Published on Aug 29, 2015 6:51 PM IST

Allu-arjun
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై, కెరీర్ మొదటి నుంచి తనదైన స్టైల్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ తన సినిమాల్లో ఎంత వైవిధ్యాన్ని చూపించడానికి ఇష్టపడతారో, అలాగే తెలుగులో వచ్చే కొత్త రకమైన సినిమాలకు కూడా తన వైపు నుంచి సపోర్ట్ ఇస్తాడు. కొత్త వారైనా, యంగ్ హీరోలైనా, తనతోటి హీరోలైనా సరే వారి సినిమాలు బాగుంటే అల్లు అర్జున్ మనస్పూర్తిగా మెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఈ సారి అల్లు అర్జున్ రిలీజ్ కి ముందే ఓ సినిమాకి తన బెస్ట్ విషెస్ ని తెలియజేశాడు.

ఆ సినిమానే నాని హీరోగా నటించిన ‘భలే భలే మగాడివోయ్’. ఈ సినిమా ట్రైలర్ బాగా నచ్చడంతో అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. దాంతో సెప్టెంబర్ 4న రిలీజ్ కానున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ అల్లు అర్జున్ ఈ చిత్ర టీం కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ మూవీ డైరెక్టర్ మారుతికి అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ అవ్వడం, అలాగే ఈ చిత్ర నిర్మాతలలో ఒకరుగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ ఉండడం మరో విశేషం. నాని సరసన లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ అందించాడు. సూపర్బ్ పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్న ఈ సినిమా నిర్మాణంలో యువి క్రియేషన్స్ వారు కూడా భాస్వాములు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు