రజనీని 420 అంటున్న బీజేపీ లీడర్ !
Published on Jul 6, 2017 4:14 pm IST


సూపర్ స్టార్ రాజనీకాంత్ రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన కార్యకలాపాలకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బయటికొచ్చి తెగ హడావుడి చేస్తున్నాయి. వాటిలో రజనీ క్యాసినోలో కూర్చుని ఉన్న ఫోటో కూడా ఒకటుంది. ఆ ఫోటోను చూసిన అభిమానులంతా రజనీ ఆరోగ్యం బాగానే ఉందని సంబరపడుతుంటే ఒక పొలిటికల్ లీడర్ మాత్రం రజనీ పై సెటైర్లు వేస్తున్నారు.

ఆ పొలిటికల్ లీడర్ ఎవరో కాదు బీజేపీకి చెందిన ఎంపీ సుబ్రమణ్యన్ స్వామి. ఎవరి మీదైనా సరే తనదైన శైలిలో చురకలు విసిరే సుబ్రమణ్యన్ స్వామి రజనీ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి ‘రజనీకాంత్ 420 ఆరోగ్యం కుదుటపడాలని క్యాసినోలో కూర్చుని గాంబ్లింగ్ ఆడుతున్నారు. రజనీకి ఆ డాలర్లు ఎక్కడి నుండి వచ్చాయో కనుక్కోవాలి’ అన్నారు ‘ అంతే కాకుండా ఆ ట్వీట్లకు స్పందిస్తూ విమర్శలు గుప్పించిన అభిమానులను ఉద్దేశించి ‘ రజనీకాంత్ 420 అభిమానులు నిరక్షరాస్యులు. కాబట్టి వాళ్ళు రియలైజ్ కాలేరు’ అని కూడా అన్నారు.

దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయి అనేక చర్చలకు దారితీస్తోంది.

 
Like us on Facebook