సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేస్తుంది..!

సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేస్తుంది..!

Published on Feb 28, 2021 9:45 PM IST

మన టాలీవుడ్ మ్యాచో ఫిజిక్ మైంటైన్ చేసే హీరోల్లో సుధీర్ బాబు కూడా ఒకడు. ఇప్పటి వరకూ తనదైన పలు ఆసక్తికర రోల్స్ లో కనిపించి మెప్పించాడు. అలాగే రీసెంట్ గా నానితో “వి” లో కనిపించి సూపర్బ్ అనిపించుకున్నాడు. అయితే మరి అదే ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను సుధీర్ చేస్తున్నాడు.

మరి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ను సుధీర్ బాబు రివీల్ చేసాడు. ఈ చిత్రం తాలూకా టైటిల్ ను రేపు సాయంత్రం 4 గంటల 1 నిమిషం కు రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.. మరి అలాగే ఈ చిత్రంలో లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా టాలెంటెడ్ కంపోజర్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని బెంచ్ మార్క్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు