బాలీవుడ్ ని మెప్పించిన సుధీర్ బాబు ..!

బాలీవుడ్ ని మెప్పించిన సుధీర్ బాబు ..!

Published on Apr 30, 2016 11:52 AM IST

sudheerbabu
యస్.యం.యస్ సినిమా ద్వారా పరిచయమైన సుధీర్ బాబు నందిత నటించిన ’ప్రేమ కథా చిత్రం’ సినిమా ఘన విజయంతో ఒక్కసారిగా వెలుగులోకివచ్చారు. కానీ తరువాత చెప్పుకోదగ్గ విజయవంతమైన సినిమాలు తన ఖాతాలో పడలేదు. అయితే అనుకోనివిధంగా బాలీవుడ్ లో ‘బాఘీ’ సినిమాలో ప్రతినాయకుడిగా అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. 2004 లో తెలుగులో వచ్చిన ’వర్షం’ సినిమా ఆధారంగా టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లు గా హిందీలో రూపుదిద్దుకున్న ‘బాఘీ’ సినిమా నిన్న విడుదలైనది.

సినిమాపై సాధారణ ప్రేక్షకులు, సినీ పండితులు పెదవి విరుస్తున్నా ఇందులో ప్రతినాయకుడు ‘రాఘవ్’ గా సుధీర్ బాబు నటనకు మాత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకులనుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. సుధీర్ బాబు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడంతో పాటు తన అనుభవాన్ని ఉపయోగించి ఇందులో మంచి నటనను ప్రదర్శించాడు. అయితే ’బాఘీ’ సినిమా అంతగా ఆకట్టుకోనప్పటికీ నటుడిగా సుధీర్ బాబు పడిన శ్రమకు గుర్తింపు లభించింది కాబట్టి సుధీర్ బాబు కి బాలీవుడ్ నుంచి మరిన్ని అవకాశాలు తప్పకుండా వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు