గురువారం షూటింగులన్ని బంద్..

గురువారం షూటింగులన్ని బంద్..

Published on Nov 26, 2014 10:00 PM IST

telugu-cinema-flag
ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న కొత్త నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎపి ఫిల్మ్ ఫెడరేషన్ గురువారం బంద్ కు పిలుపునిచ్చింది. వేతనాలు పెంచాల్సిందిగా సినీ కార్మికులు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. మా డిమాండ్ లను ఫిల్మ్ చాంబర్ పట్టించుకోలేదని వీరు ఆరోపించారు.

సినిమా షూటింగ్ లలో ఇతర ఇండస్ట్రీ వర్కర్స్ ను అనుమతిస్తూ ఇటివల నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలకు అనుగుణంగా నిర్మాతలు తాము ఎంపిక చేసుకున్న కార్మికులతో పని చేసుకునే వెసులుబాటు ఉందని ఫిల్మ్ చాంబర్ పెద్దలు పేర్కొన్నారు. ఈ నిర్ణయంకు వ్యతిరేకంగా ఫిల్మ్ ఫెడరేషన్ బంద్ నిర్వహిస్తుంది. ఇతరులు సినిమా షూటింగులలో పాల్గొంటే సహించేది లేదని ఫెడరేషన్ స్పష్టం చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు