ఇంటర్వ్యూ: సుకుమార్ – ఆ పేరు నాకొస్తుందనే సినిమా సెట్స్ కు కూడా వెళ్ళలేదు !

ఇంటర్వ్యూ: సుకుమార్ – ఆ పేరు నాకొస్తుందనే సినిమా సెట్స్ కు కూడా వెళ్ళలేదు !

Published on Aug 1, 2017 5:36 PM IST


ఒకవైపు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు సుకుమార్ రైటింగ్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి చిన్న సినిమాల్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సుకుమార్. తాజాగా ఆయన నిర్మించిన చిత్రం ‘దర్శకుడు’ ఈ నెల 4న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయన సినిమా గురించి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) సినిమా అవుట్ ఫుట్ ఎలా వచ్చింది ?
జ) సినిమా అవుట్ ఫుట్ చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ మాట నిర్మాతగా చెప్పడంలేదు. ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నాను. సినిమా చూడాగానే ఎలా వచ్చిందో అర్థమైపోతుంది. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను.

ప్ర) ఈ సినిమాలో మీ స్టైల్ ఉంటుందా ?
జ) ఇదసలు నా స్టైల్ సినిమా కాదు. అందుకే నాకు అంతగా నచ్చిందేమో.

ప్ర) నటనలో హీరో మిమ్మల్నే ఫాలో అయ్యానని చెప్పారు. నిజమేనా ?
జ) అంటే తనకు బాగా తెలిసిన దర్శకుడిని, తన కళ్ళముందు ఎక్కువగా ఉన్న దర్శకుడ్ని నేనే. అందుకే నా బాడీ లాంగ్వేజ్ ను రిఫరెన్స్ గా తీసుకోనుండొచ్చు.

ప్ర) మొదట్లో అతన్ని హీరోగా వద్దన్నారట ?
జ) నేనంటే చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టంతో ఇక్కడికొచ్చాను. వాడు నన్ను చూసి ఇందులోకి వచ్చాడు. వాడు చదివింది ఎమ్మెసీ ఫిజిక్స్. తర్వాత పి . హెచ్. డి చేయిద్దామని అనుకున్నా. హరిప్రసాద్ జక్కా కథ చెప్పి అశోక్ తో చేస్తానన్నాడు. వద్దన్నాను. కానీ అతను ఒప్పుకోలేదు. వర్క్ షాప్స్ పెట్టి చేయించాడు. కొన్ని షాట్స్ చూసి బాగానే చేస్తున్నాడని ఓకే అన్నా.

ప్ర) ఈ సినిమాని స్టార్ హీరోతో చేసుండొచ్చు కదా ?
జ) అది పూర్తిగా హరిప్రసాద్ నిర్ణయం. ఎవరైనా మార్కెట్ ఉన్న స్టార్ హీరోతో చేసుంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది.

ప్ర) అతని యాక్టింగ్ ఎలా అనిపించింది ?
జ) కొన్ని ఉద్విజ్ఞమైన సన్నివేశాల్లో చాలా బాగా నటించాడు. అనుభవం ఉన్న నటుడిలా చేశాడు. కోపం అంటే నిజమైన కోపం, బాధంటే నిజమైన బాధ వంటి రియల్ ఎమోషన్స్ ఉన్నాయి. ఒక 70 శాతం చాలా బాగా చేశాడు.

ప్ర) డైరెక్టర్ గా అతనికి అవకాశమిస్తారా ?
జ) చేతిలో నైపుణ్యమున్నప్పుడు ఎలాగైనా బ్రతకొచ్చు. ఈ సినిమా హిట్ అయితే అతనికి రెండు అవకాశాలొస్తాయి. ఈ సినిమా రిజల్ట్ అతని భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. అతని రైటింగ్ కూడా బాగుంటుంది కాబట్టి అతనే రాసుకుని సినిమా చేసుకోవచ్చు. నేనైతే అవకాశమిస్తానని ఎలాంటి మాటా ఇవ్వలేదు.

ప్ర) ఈ సినిమాకి ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించారు ?
జ) కథ నాది కాదు కాబట్టి పెద్దగా బర్డెన్ ఫీలవలేదు. ఏదో అనుభవం కొద్ది చిన్న చిన్న సలహాలు ఇచ్చేవాడిని కానీ పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాను. ఇక ప్రొడక్షన్ విషయానికొస్తే ఎంతవరకు కావాలో అంతవరకే ఇన్వాల్వ్ అయ్యాను. ఎక్కువ మా అన్నయ్య, థామస్ రెడ్డిలు చూసుకున్నారు.

ప్ర) ఈ సినిమా సెట్స్ కి ఒక్కసారి కూడా ఎవళ్ళలేదని విన్నాం. నిజమేనా ?
జ) అవును నిజమే. ఎందుకంటే ఒకే సెట్ లో ఇద్దరు దర్శకులు ఉన్నప్పుడు వాళ్ళ వ్యూస్ చాలా తేడాగా ఉంటాయి. అంతేగాక నేను వెళితే అంతా సుకుమార్ డైరెక్ట్ చేశాడని అంటారు. అతను అంత కష్టపడి చేస్తున్నప్పుడు అలా అనడం సరికాదు కదా.

ప్ర) ఇందులో దర్శకుడంటే 20 % క్రియేటివిటీ 80 % మేనేజ్మెంట్ అన్నారు. పర్సనల్ గా మీ ఫీలింగ్ ఏంటి ?
జ) కథ రాసేంత వరకు మన చేతిలో ఉంటుంది. ఆ తర్వాత వేరే వాళ్ళను ఒప్పించాలి. సెట్లలో 400 మంది ఉంటారు. అందరూ డైరెక్టర్ చెప్పేది చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్లందరినీ నొప్పించకుండా సినిమా తీయాలి. అంటే 20 % ఎఫర్ట్ తో 80 % మేనేజ్ చెయ్యాలి. 80 % ఎఫర్ట్ తో 20 % క్రియేటివిటీ చూపించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు