త్వరలో.. హీరోగా నా వందవ సినిమా!

త్వరలో.. హీరోగా నా వందవ సినిమా!

Published on Mar 5, 2015 4:45 PM IST

suman
ప్రముఖ నటుడు సుమన్ హీరోగా తెరకెక్కే వందో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తాను ఇప్పటి వరకూ 400లకు పైచిలుకు చిత్రాల్లో నటించాననీ, అందులో హీరోగా నటించినవి 99 సినిమాలని ఆయన అన్నారు. తన వందవ చిత్రానికి సామాజిక అంశంతో కూడిన కథను తయారుచేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్ర పూర్తి విషయాలను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో పోటాపోటీగా హీరోగా అనేక చిత్రాల్లో నటించిన సుమన్‌కు తెలుగులో మంచి పేరుంది. తెలుగు వాడు కాకపోయినా, ఆయన ఎక్కువగా నటించింది తెలుగు సినిమాల్లోనే. ఇప్పుడీ వందవ సినిమా కూడా తెలుగులోనే రానున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు