‘నరుడా డోనరుడా’ ట్రైలర్ టాక్ : ఓపెన్ మైండ్ తో చూస్తే ఈ విక్కీ అందరికీ నచ్చుతాడు !

‘నరుడా డోనరుడా’ ట్రైలర్ టాక్ : ఓపెన్ మైండ్ తో చూస్తే ఈ విక్కీ అందరికీ నచ్చుతాడు !

Published on Sep 27, 2016 4:35 PM IST

naruda-1
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక తడబడుతున్న అక్కినేని హీరో సుమంత్ 2014 తరువాత ఈ ఏడాదే ‘నరుడా డోనరుడా’ అనే సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ ‘అయినా విక్కీ డోనార్’ కి రీమేక్ గా ఈ చిత్రం వస్తోంది. నూతన దర్శకుడు మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తాలూకు ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంతకుముందే విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో హీరో సుమంత్ ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరిగే కుర్రాడు విక్కీగా కనిపిస్తాడు. అలాగే నటుడు తనికెళ్ళ భరణి ఫెర్టిలిటీ సెంటర్ నడిపుతూ పిల్లలు లేని వారికి కోసం వీర్యదాత కోసం వెతుకుతూ, వీర్య దానం చేయమని విక్కీని బలవంతపెట్టే ఆంజనేయులు అనే డాక్టర్ గా నటించాడు.

ఇందులో సుమంత్, తణికెళ్లభరణి ల మధ్య నడిచే కామెడీ సన్నివేశాలు, బోల్డ్ సంభాషణలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఫెర్టిలిటీ డాక్టర్ గా భరణి నటన సినిమాకి హైలెట్ గా నిలిచేలా కనిపిస్తోంది. విక్కీ పాత్రలో సుమంత్ కూడా ఇదివరకు లేని బాడీ లాంగ్వేజ్ తో కొత్తగా కనిపిస్తున్నాడు. అలాగే ఆషిమా రాయ్ పాత్రలో హీరోయిన్ పల్లవి సుభాష్ కు, సుమంత్ కు మధ్య సాగే రొమాంటిక్ సీన్లు కూడా బాగున్నాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తేనే ఇది పిల్లలు లేనివారికి వీర్యదానం చేసే కుర్రాడి కథ అర్థమయిపోతుంది. ఇంత వరకూ బాగానే ఉన్న వీర్యదానం అనే కొత్త, తెలుగువారికి అంతగా పరిచయంలేని కంటెంట్ తో ఈ చిత్రం వస్తోంది. కాబట్టి ప్రేక్షకులు కాస్త ప్రాక్టికల్ గా, ఓపెన్ మైండ్ తో చూస్తే సినిమాకి మంచి జరిగినట్టే.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు