సందీప్ కిషన్ రిలీజ్ చేసిన ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’ ఆడియో

సందీప్ కిషన్ రిలీజ్ చేసిన ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’ ఆడియో

Published on Nov 25, 2014 10:15 AM IST

ocheliya-napriya-sakhiya
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారిన మనోజ్ నందం హీరోగా స్మితిక, మోనికా సింగ్ హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’. ఈ సినిమా ఆడియో లాంచ్ నిన్న హైదరబాద్ లో జరిగింది. యంగ్ హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఈ ఆడియోని లాంచ్ చేసాడు. అలాగే సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘మనోజ్ మంచి నటుడు. తనకి ఈ సినిమా బ్రేక్ ఇవ్వాలని ఆశిస్తున్నానని’ అన్నాడు.

ఈ చిత్ర దర్శక నిర్మాత అయిన పి. రమేష్ బాబుల్ రెడ్డి మాట్లాడుతూ ‘ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన సినిమా ఇది. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని’ అన్నాడు. సాకేత్ నాయుడు ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఈ ఆడియో విడుదలకి వచ్చిన పలువురు ప్రముఖులు ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు