తమిళ సూపర్ హిట్ రీమేక్ లో సందీప్ కిషన్

తమిళ సూపర్ హిట్ రీమేక్ లో సందీప్ కిషన్

Published on Nov 29, 2015 6:55 PM IST

Sundeep_Kishan

2013 సమ్మర్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్ అయిన తమిళ సినిమా ‘నీరం’. ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చెయ్యడానికి రంగం సిద్దం చేసారు. సినిమా సినిమాకి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ, మార్కెట్ ని పెంచుకుంటూ వస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమా రీమేక్ లో హీరోగా నటించనున్నాడు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో పిక్సెల్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ తెలుగు రీమేక్ ని నిర్మించనున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాని ‘Mr నూకయ్య’ ఫేం అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించనున్నాడు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాకి యంగ్ అండ్ టాలెంటెడ్ టీంని సెట్ చేసారు. ఆర్య 2, ఆరెంజ్ సినిమాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, ప్రసన్న డైలాగ్ రైటర్ గా పనిచేయనున్నారు. వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్ళనున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన నటించే హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు