ఐదు సినిమాలను రెడీ చేస్తోన్న యువహీరో!

ఐదు సినిమాలను రెడీ చేస్తోన్న యువహీరో!

Published on Jan 17, 2017 5:14 PM IST

sundeep
తెలుగుతో పాటు తమిళంలోనూ పలు క్రేజీ సినిమాలు చేస్తూ హీరోగా ఓ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోన్న సందీప్ కిషన్, కొద్దికాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన కెరీర్‌ను ఎలాగైనా గాడిలో పెట్టుకోవాలన్న ఆలోచనతో ప్రస్తుతం ఆయన ఏకంగా ఐదు డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. ఈ ఐదు సినిమాల్లో రెండు స్ట్రైట్ తెలుగు సినిమాలు కాగా, రెండు తమిళ సినిమాలు, ఒకటి తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం. తమిళ సినిమాలైన ‘మాయావన్’, ‘మా నగరం’ ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నాయి.

ఇక తెలుగు సినిమాల్లో ఒకటి కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నక్షత్రం’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. ఇక సూపర్‌స్టార్ మహేష్ సోదరి మంజుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మరో తెలుగు సినిమా ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్ళింది. ఈ సినిమాతో సమాంతరంగా తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కే సుశీందర్ సినిమాను కూడా పూర్తి చేస్తున్నారు సందీప్ కిషన్. వైజాగ్‍లో నేడు ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ మొదలైంది. మెహ్రీన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలన్నీ 2017లోనే వచ్చేవే కావడంతో ఇందులో ఏవి సందీప్ కిషన్‌కు గుర్తింపు తెస్తాయన్నది వేచిచూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు