ట్రైలర్ : ‘ఈడు గోల్డ్ ఎహే’ సునీల్‍కు హిట్ తెచ్చేనా?

ట్రైలర్ : ‘ఈడు గోల్డ్ ఎహే’ సునీల్‍కు హిట్ తెచ్చేనా?

Published on Sep 26, 2016 8:28 AM IST

eedu-goldehe
కమెడియన్‌ నుంచి హీరోగా మారాక సునీల్ కొద్దికాలంగా మంచి హిట్ కోసం ఎంతగానో తపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమధ్యే ‘జక్కన్న’ అనే సినిమాతో మెప్పించేందుకు వచ్చినా, ఆ సినిమా కూడా ఊహించిన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో ఇప్పుడు సునీల్‌‌కు ఒక హిట్ అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన కొత్త సినిమా ‘ఈడు గోల్డ్ ఎహే’పై భారీ ఆశలే పెట్టుకున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల కానున్న ఈ సినిమాను ఇప్పట్నుంచే టీమ్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ వస్తోంది.

వీరు పోట్ల తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను నిన్న సాయంత్రం విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు సునీల్ గత చిత్రాలతో పోల్చితే మంచి స్పందన వచ్చింది. ట్విస్ట్‌లతో కూడుకున్న మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమా తెరకెక్కిందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. అదేవిధంగా ఎప్పట్లానే సునీల్ ఎనర్జీయే సినిమాకు హైలైట్‌గా నిలిచేలా కనిపిస్తోంది. ట్రైలర్‌తో మెప్పించిన సునీల్ సినిమాతో కూడా మెప్పిస్తారా అన్నది వేచిచూడాలి. సునీల్ సరసన సుష్మా రాజ్, రిచా పనాయ్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మించింది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు