యువ హీరో సినిమాలో నటిస్తున్న సునీల్ !

యువ హీరో సినిమాలో నటిస్తున్న సునీల్ !

Published on May 19, 2018 8:55 AM IST

ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వెలుగొందిన నటుడు సునీల్ తర్వాత హీరోగా మారి కొన్ని విజయాలను అందుకున్నా ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలు ఎదురుకావడంతో మరోసారి తన పాత పద్దతిని ట్రై చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్న ఈయన తాజాగా యువ హీరో శర్వానంద్ సినిమాలో నటిస్తున్నట్టు తెలిసింది.

శర్వా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచె మనసు’ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సునీల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఆయన పాత్ర ఎలాంటిది, ఎంతసేపు ఉంటుంది వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సాయి పల్లవి కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు