Like us on Facebook
 
పవన్ మాటలే ఆదర్శంగా నిలిచాయన్న సునీల్!

sunil
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు తన 45వ పుట్టినరోజు జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. అభిమానులంతా పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ నిన్నట్నుంచి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇక అభిమానుల నుంచే కాక సినీ ప్రముఖుల నుంచి కూడా పవన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం హీరోగా మెప్పిస్తోన్న సునీల్ సైతం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతూ ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఉదయం టిట్టర్‌లో పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. పవన్ బలంగా చాటిచెప్పిన ‘యద్భావం తద్భవతి’ అన్న మాటలనే తాను ఎప్పటికీ నమ్ముతానని, తనలాంటి ఎందరికో పవన్ కళ్యాణ్ ఆదర్శంగా నిలిచారని సునీల్ అన్నారు. గత కొద్దికాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న సునీల్, ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Bookmark and Share