సునీల్ సినిమా సెన్సార్ పూర్తి.. దసరాకే రిలీజ్!
Published on Sep 28, 2016 3:03 pm IST

eedu-goldehe
కమెడియన్‌ నుంచి హీరోగా మారాక సునీల్ కొద్దికాలంగా మంచి హిట్ కోసం ఎంతగానో తపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమధ్యే ‘జక్కన్న’ అనే సినిమాతో మెప్పించేందుకు వచ్చినా, ఆ సినిమా కూడా ఊహించిన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో ఇప్పుడు సునీల్‌‌కు ఒక హిట్ అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన కొత్త సినిమా ‘ఈడు గోల్డ్ ఎహే’పై భారీ ఆశలే పెట్టుకున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల కానున్న ఈ సినిమా నేటితో సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని పక్కాగా విడుదలకు సిద్ధమైంది.

సెన్సార్ బృందం ఈ యాక్షన్ కామెడీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. వీరు పోట్ల తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌, ఆడియో ఈమధ్యే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ట్విస్ట్‌లతో కూడుకున్న మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమా తెరకెక్కిందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. అదేవిధంగా ఎప్పట్లానే సునీల్ ఎనర్జీయే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. సునీల్ సరసన సుష్మా రాజ్, రిచా పనాయ్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మించింది.

 
Like us on Facebook