సన్నీలియోన్ రెమ్యునరేషన్ 75 లక్షలు మాత్రమే..!

సన్నీలియోన్ రెమ్యునరేషన్ 75 లక్షలు మాత్రమే..!

Published on Oct 20, 2014 1:30 PM IST

current-theega
మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’ సినిమాలో హాట్ హీరోయిన్ స్పెషల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. సినిమాలో కీలకమైన టీచర్ పాత్రలో నటించినడంతో పాటు హాట్ హాట్ ఐటెం సాంగ్ లో స్టెప్పులేసింది. ఈ సినిమాలో నటించినందుకు సన్నీ లియోన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా..? 75 లక్షల రూపాయలు మాత్రమే. ఈ విషయాన్ని హీరో మంచు మనోజ్ వెల్లడించారు. ప్రేక్షకులలో ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా 75 లక్షలు ఇవ్వడానికి నిర్మాత మంచు విష్ణు అంగీకరించడంతో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది సన్నీ. ఇప్పటికే విడుదలైన సన్నీ లియోన్ సాంగ్ సినిమాకు హైప్ తీసుకొచ్చింది.

మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. యాక్షన్ – కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు జి.నాగేశ్వర రెడ్డి దర్సకత్వం వహించారు. అచ్చు సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు