శేఖర్ సూరి సినిమాలో సన్నీ లియోనీ !
Published on Jul 18, 2017 9:10 am IST


విలక్షణ దర్శకుడు శేఖర్ సూరి తన కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్లో నటించడానికిగాను ఆయన బాలీవుడ్ నటి సన్నీ లియోనీని సంప్రదించారట. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ‘తెలుగు వెర్షన్లో షెర్లిన్ చోప్ర చేసిన పాత్రను హిందీలో సన్నీ లియోనీతో చేయించాలని ఆమెను సంప్రదించాను. ఆ పాత్ర ఆమెకు చాలా బాగా సూటవుతుంది. చేస్తే ఆమే చెయ్యాలి’ అన్నారు.

ఒకవేళ ఈ చర్చలు గనుక ఫలిస్తే ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించిన సన్నీ లియోనీ శేఖర్ సూరి చిత్రంలో కూడా మెరవడం ఖాయం. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కి 2005 లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించి దర్శకుడిగా శేఖర్ సూరికి మంచి గుర్తింపు తెచ్చింది. ఇకపోతే ఈయన డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘డా. చక్రవర్తి’ గత శుక్రవారం విడుదలైంది.

 
Like us on Facebook