‘సూపర్ స్కెచ్’ గొప్ప ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ : హీరో ఇంద్ర

‘సూపర్ స్కెచ్’ గొప్ప ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ : హీరో ఇంద్ర

Published on May 23, 2018 11:00 AM IST

‘సూపర్‌ స్కెచ్‌’ సినిమా నలుగురు కుర్రాళ్ల మధ్య నడిచే కథ.. ఆ కుర్రాళ్లలో నేనూ ఒకడిని అంటూ చిత్రం గురించి కథానాయకుడు ఇంద్ర మాట్లాడుతూ ‘మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో లీనమై నటించే అవకాశం ఈ సినిమా ద్వారా లభించింది. హీరోకు సమాంతరంగా సాగుతూ వివిధ రకాల షేడ్స్ నా క్యారెక్టర్‌లో కనిపించి అందర్నీ విశేషంగా ఆకట్టుకునేలా చేస్తుంది. ఇదొక సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఏ నటుడికైనా ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తుంటాయి. దర్శకుడు రవి చావలి చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రతీ ఒక్కర్నీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం చూస్తున్నంతసేపు ప్రతి నిమిషం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకుల దృక్పథం మారింది. ఏం చెప్పినా.. సుతిమెత్తగా వినోదాత్మకంగానే చెప్పాలి. మన దగ్గర ఓ సీరియెస్ పాయింట్ ఉంది కదా అని.. దాన్ని మరింత సీరియెస్‌గా చెప్పకూడదు. అందరికీ నచ్చే విధంగానే చెప్పాలి. మా చిత్రంలో అందరికీ నచ్చే విధమైన అంశాలే కనిపిస్తాయి. ప్రజల దృష్టికోణం మారుతోంది. నా సినిమా చూసి ఇంటికెళ్లే ప్రతీ ప్రేక్షకుడు ఎంతో సంతోషంతో వెళ్లాలని కోరుకుంటా. మనసుకు నచ్చేవి చేసుకుంటూ వెళ్లడమే నా పని. నాకు మనసుకు నచ్చిన ఎలాంటి క్యారెక్టర్ అయినా పోషించి పేరు తెచ్చుకోవాలనుంది. అది హీరోనా, విలనా? అని కూడా చూడను. చేసే క్యారెక్టర్‌లో దమ్ముండాలే గాని.. అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా’ అన్నారు.

అంతేగాక ఇప్పుడిప్పుడే సంతృప్తికరమైన ప్రోత్సాహం లభిస్తోంది. రాజమౌళి ‘సై’ చిత్రంతో నా సినీ ప్రయాణం మొదలైంది. అప్పట్పుంచి గత 12 ఏండ్లుగా ‘సైనికుడు’, ‘అర్జున్‌’, ‘కుర్‌ కురే’, ‘దగ్గరగా దూరంగా’, ‘శ్రీమన్నారాయణ’, ‘కిక్‌ 2’, ‘సందట్లో సడేమియా’, ‘లక్ష్మీ కళ్యాణం’ వంటి దాదాపు 15 చిత్రాల్లో పలు భిన్న పాత్రలను పోషించాను. 2011లో ‘పుత్రుడు’ చిత్రంతో హీరోగా మారాను. హీరోగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించింది. నటుడిగా విమర్శకుల ప్రశంసల్ని కూడా సొంతం చేసుకున్నాను. మంచి చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశంతో ఫ్రెండ్స్‌ ఫిల్మ్‌ అకాడమీని స్థాపించాను. క్యారెక్టర్స్‌లో దమ్ముంటే ఎలాంటి క్యారెక్టర్‌లో అయినా సరే నటించేందుకు నేను రెడీగా ఉన్నాను. అలాగే అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను’ అంటూ తన మనసులోని మాటను వ్యక్తపరిచారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు