సినిమాక్స్ లో స్పెషల్ షో చూసిన కృష్ణ, ఫ్యామిలీ

సినిమాక్స్ లో స్పెషల్ షో చూసిన కృష్ణ, ఫ్యామిలీ

Published on Sep 19, 2014 10:35 AM IST

krishna-with-family
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘ఆగడు’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతిసారి మహేష్ బాబు సినిమాలను మొదటి రోజే చూసే సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు కూడా ఆగడు చూసారు. కొద్దిసేపటి క్రితం సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల మరియు ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కలిసి చూసారు. చూసిన వారు సినిమా చాలా బాగుందని తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.

అలాగే ఈ రోజు ఉదయం నుంచి మన ఇరు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా షోస్ పడిపోయాయి. మహేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు