పూర్తి గడ్డంతో మహేష్ బాబు !

పూర్తి గడ్డంతో మహేష్ బాబు !

Published on May 24, 2018 5:49 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మెకోవర్ పరంగా ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లోనూ ఒకేలా కనిపిస్తుంటారు. పాత్ర ఎలాంటిదైనా ఆయన మాత్రం కేలీన్ షేవ్ తో క్లాసీ లుక్లో కనిపిస్తూ అభిమానుల్ని ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉన్నారు. కానీ ఈసారి మాత్రం ఆయన పూర్తి గడ్డంతో కనిపించనున్నారని వినికిడి.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు త్వరలో కొత్త సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాలోనే మహేష్ కొంత భాగం పూర్తి గడ్డంతో కనిపిస్తారట. ఈ వార్తే గనుక నిజమైతే మహేష్ అభిమానులకు నెక్స్ట్ సినిమాలో కొత్త ప్రిన్స్ కనిపించడం ఖాయమనుకోవచ్చు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఎక్కువ భాగం అమెరికాలోనే జరగనుంది. ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు