ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచిన సూపర్ స్టార్

ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచిన సూపర్ స్టార్

Published on Jul 4, 2015 1:01 PM IST

rajnikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ తన తదుపరి చిత్రం రంజిత్ పా దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్న సంగతి తెలిసినదే. మలేసియాలో అధికభాగం తెరకెక్కించనున్న ఈ చిత్ర మొదటి షెడ్యూల్ త్వరలో ప్రారంభంకానుంది.

ప్రస్తుతం పూర్వ నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. అయితే చెన్నై లో జరుగుతున్న వర్క్ షాప్ కి హటాత్తుగా రజినీకాంత్ వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. స్వయానా సూపర్ స్టార్ రాకతో చిత్రబృందం ఆశ్చర్యపోయారట. రజినీ కొన్ని సీన్లకు సైతం ప్రాక్టీస్ చేసినట్టు సమాచారం.

గ్యాంగ్ స్టర్ పాత్రలో రజినీ కనిపించనున్నారు. సంతోష్ నారాయణ్ సంగీత దర్శకుడు. కలై పులి ఎస్ థను నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు