ఇకపై అన్ని థియేటర్లలో జాతీయ గీతం తప్పనిసరి!

flag
జాతీయ గీతం అంటే ప్రతీ భారత పౌరుడి గర్వానికి నిదర్శనం. జన గణ మన అంటూ దేశాన్ని తల్చుకుంటూ మనం పాడుకునే ఈ జాతీయ గీతాన్ని ఇకపై అన్ని థియేటర్లలోనూ సినిమా మొదలయ్యేముందు ప్రదర్శించాలని సుప్రీమ్ కోర్టు ఆదేశించింది. ఇప్పటికే దేశంలోని పలు కార్పోరేట్ సంస్థలకు చెందిన మల్టీప్లెక్స్‌లలో జాతీయ గీతాన్ని ప్రదర్శించడం, ఆలపించడం అన్న సంప్రాదాయం ఉన్నా సింగిల్ స్క్రీన్స్ వరకూ ఇది రాలేదు.

ఇక ఇప్పుడు భారతదేశ అత్యుత్తమ కోర్టు ఆదేశించడంతో అన్ని థియేటర్లలోనూ జాతీయ గీతం వినిపించనుంది. షో మొదలవ్వడానికి ముందు జాతీయ గీతాన్ని ప్లే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మొదట్నుంచీ ఉన్న ఒరిజినల్ గీతాన్నే తప్ప ఈమధ్య కాలంలో రీమిక్స్ చేసిన వాటిని కూడా ప్లే చేయవద్దని సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది.

 

Like us on Facebook