కళ్యాణ్ రామ్ సరసన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ భామ?

కళ్యాణ్ రామ్ సరసన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ భామ?

Published on Feb 10, 2016 12:02 PM IST

Surabhi
గత ఏడాది ‘పటాస్’తో హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఆ తర్వాత చేసిన షేర్ సినిమాతో నిరుత్సాహపరిచాడు. దాంతో కాస్త నిధానంగా ప్రేక్షకులను పక్కాగా ఎంటర్టైన్ చేసే కథలను ఎంచుకునే పని లో పడ్డాడు. అందులో భాగంగానే తన బ్రదర్ ఎన్.టి.ఆర్ కి గత ఏడాది హిట్ ఇచ్చిన పూరి జగన్నాధ్ తో తన సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. ఏప్రిల్ నుంచి మొదలు కానున్న ఈ సినిమాని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ అయిన నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పై నిర్మించనున్నాడు.

ఈ సినిమా అనౌన్స్ చేయగానే ఈ సినిమాకి సంబందించిన పనులను కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగా మొదటగా కళ్యాణ్ రామ్ సరసన నటించే హీరోయిన్ కోసం చూస్తున్నారు. అందులో భాగంగా ఎక్స్ ప్రెస్ రాజాతో హిట్ అందుకున్న నార్త్ ఇండియన్ బ్యూటీ సురభిని ఎంపిక చేసే పనిలో ఉన్నారట. ఇటీవలే ఈ భామని అప్రోచ్ అయ్యారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అన్నీ ఓకే అయితే కళ్యాణ్ రామ్ – పూరి జగన్నాథ్ – సురభి కాంబినేషన్ లో ఈ సినిమా ఉంటుంది. లేదా సురభి ప్లేస్ లో వేరే హీరోయిన్ వస్తుంది. ఈ విషయం పై త్వరలోనే క్లారిటీ వస్తుంది. ఈ సినిమా కోసం పూరి ‘రీమిక్స్’ అనే టైటిల్ ని కూడా రిజిష్టర్ చేసాడని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు