ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: పవన్ – వెంకటేష్ గారితో కలిసి ఖచ్చితంగా నటిస్తాను !

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: పవన్ – వెంకటేష్ గారితో కలిసి ఖచ్చితంగా నటిస్తాను !

Published on Mar 12, 2017 3:45 PM IST


ప‌వ‌న్‌, కారుణ్య‌ చౌదరి జంటగా న‌టించిన సినిమా `ఏటీఎం వ‌ర్కింగ్‌’. డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్‌, శ్రావ్య ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ‘గంగపుత్రులు’ వంటి మంచి సందేశాత్మక చిత్రంతో అందరి ప్రసంశలు అందుకున్న పి.సునీల్ కుమార్ రెడ్డి డైరెక్ట్ చేశారు. మార్చి 17న చిత్ర రిలీజ్ సందర్బంగా పవన్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం…

ప్ర) చెప్పండి.. మీ సినీ కెరీర్ ఎలా మొదలైంది ?
జ) నేను విక్టరీ వెంకటేష్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన సినిమాల వలనే నటుడినవ్వాలనే కోరిక కలిగింది. 2010లో ఇండస్ట్రీలోకి వచ్చాను. మొదట్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సిఎంఆర్ లాంటి సంస్థల ప్రకటనల్లో నటించాను. ఆ 2011లో తర్వాత మిర్చిలో చేసిన పాత్ర నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ప్ర) ఈ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది?
జ) సంవత్సరం క్రితం సునీల్ రెడ్డిగారిని కలిసి ఒక 20 నిముషాలు మాట్లాడాను. కేవలం ఆ పరిచయంతోనే ఆయన ఫోన్ చేసి ఇలా ఒక కథ అనుకున్నాం, నువ్వైతే బాగుంటావనిపించింది అన్నారు. నేను కూడా వెంటనే ఒప్పుకున్నాను.

ప్ర) ఈ సినిమా మీ కెరీర్ కు ప్లస్ అవుతుందని అనుకుంటున్నారా ?
క) ఖచ్చితంగా. ఇప్పటిదాకా నాకంటూ ఒక ప్రొఫైల్ లేదు. ఈ సినిమాతో అది వస్తుంది. అందరికీ తెలుస్తాను. మంచి సినిమాలు వస్తాయని అనుకుంటున్నాను.

ప్ర) సునీల్ రెడ్డిగారితో పనిచేయడం ఎలా అనిపించింది ?
జ) ఆయన మమ్మల్ని తన పిల్లల్లా చూసుకునేవారు. చాలా నెమ్మదిగా మాట్లాడతారు. సిన్సియర్, సరదాగా ఉంటారు. ఆయన్ను చూసిన తర్వాత ఎక్కడ ఎలా ఉన్నా వర్క్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉండాలని అర్థమయింది. అందుకే ఆయనెంత ఫ్రీడమిచ్చిన మా లిమిటిస్ లో మేం ఉంటాం.

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
జ) ఇందులో నా పాత్ర పేరు అనంత్. చదువైపోయి బిజినెస్ చేసి సెటిల్ అవ్వాలనుకుని కష్టపడే క్యారెక్టర్. అందరికీ నచ్చుతుంది. ఈ పాత్ర నాకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతుందని అనుకుంటున్నాను.

ప్ర) భవిష్యత్తులో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది ?
జ) అంటే పర్టిక్యులర్ గా హీరోగానే చెయ్యాలని ఏం లేదు. మంచి పాత్రలు ఎలాంటివైనా చేస్తాను. వెంకటేష్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలతో కలిసి నటించాలని ఉంది. ఖచ్చితంగా నటిస్తాను.

ప్ర) సినిమాల్లోకి వస్తానంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ?
జ) మా నాన్న ప్రిన్సిపాల్. నెను సినిమాల్లోకి వెళ్తానంటే మొదట కాస్త అయిష్టంగానే ఉన్నారు. కానీ మిర్చి సినిమాలో నా నటనకు వచ్చిన రెస్పాన్స్ చూసి నేను దారిలోనే ఉన్నానని, సక్సెస్ దొరుకుతుందని సంతోషపడ్డారు.

ప్ర) హీరోయిన్ కారుణ్య చౌదరితో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) నేను ఇంతకు ముందు అన్ని యాడ్స్ లో నటించింది సౌత్ అమ్మాయిలతోనే. కానీ కారుణ్య చౌదరి తెలుగమ్మాయి. ఆమెతో వర్క్ చేయడం చాలా బాగుంది. ఒక మంచి అనుభవం.

ప్ర) భవిష్యత్తులో మీ ప్లాన్స్ ఏంటి ?
జ) భవిష్యత్తులో నటుడిగానే కొనసాగుతాను. మంచి మంచి పాత్రలు చేసుకుంటూ వెళ్లాలని ఉంది. అలాగే ఇంకో 2, 3 ఏళ్లలో ప్రొడక్షన్లోకి కూడా వస్తాను.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) ఈ సినిమా తర్వాత ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రానికి దర్శకత్వ విభాగంలో పనిచేసిన కూరపాటి రామారావుగారితో ఒక సినిమా, దినకర్ గారితో మరోక సినిమా ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు