అప్పుడే సూర్య 40వ లేటెస్ట్ అప్డేట్.!

అప్పుడే సూర్య 40వ లేటెస్ట్ అప్డేట్.!

Published on Jan 21, 2021 11:00 AM IST

మన దక్షిణాదిలో మంచి లవబుల్ టాప్ హీరోల్లో సూర్య కూడా ఒకరు. తమిళ్ ఎలా అయితే సూర్య సినిమాలకు ఆదరణ దక్కుతుందో అంతే స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణను అందిస్తారు. తన నటనకు కానీ తాను చేసే సినిమాలకు కాను సెపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ ఆ మధ్య మాత్రం సూర్యకు సరైన విజయం లేకపోడంతో మంచి కం బ్యాక్ కావాలని అనుకున్నారు.

మరి ఆ టైం లో వచ్చిన “ఆకాశం నీ హద్దురా” ఓటిటిలో ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. అయితే అది సూర్య 38వ సినిమా కాగా ఇంకా 39 వ సినిమాకు ఇంకా సరైన కన్ఫర్మేషన్ లేదు కానీ అప్పుడే 40వ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఈ సినిమాను కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు పాండి రాజ్ దర్శకత్వం వహించనున్నాడట.

మరి అలాగే ఈ చిత్రానికి గాను నాని “గ్యాంగ్ లీడర్” హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించనున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని అక్కడ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారట. అలాగే త్వరలోనే ఈ సినిమా షూట్ కూడా స్టార్ట్ కానుందని టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు