ఇంటెక్స్ బ్రాండ్ అంబాసిడర్ గా సూర్య

ఇంటెక్స్ బ్రాండ్ అంబాసిడర్ గా సూర్య

Published on Aug 3, 2015 8:20 AM IST

suriya
స్వతహాగా తమిళ హీరో అయినా యంగ్ హీరో సూర్యకి మాత్రం సౌత్ తో పాటు బాలీవుడ్ కూడా కాస్త గుర్తింపు ఉంది. ప్రస్తుతం సూర్య విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్న ’24’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సూర్య మొదటి నుంచి సినిమాలతో బిజీగా ఉంటూనే పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పుడల్లా వాటి కోసం కమర్షియల్ యాడ్స్ చేస్తూ, వాటి ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ సూర్య బిజీ బిజీగా గడుపుతుంటాడు. ఇప్పటికే టివిఎస్ మోటార్స్, ఎయిర్ సెల్, సన్ ఫీస్ట్, నెస్ కఫే మరియు భారతి సిమెంట్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సూర్య తాజాగా మరో నేషనల్ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసాడు.

సూర్య తాజాగా ఇంటెక్స్ మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసాడు. తమిళనాడులో ఇకపై ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్స్ కి సూర్య బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి, ఇంటెక్స్ బ్రాండ్ ని ప్రమోట్ చేయనున్నాడు. ఈ బ్రాండ్ కి తెలుగు రాష్ట్రాల్లో అనుష్క బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. సూర్య నటిస్తున్న 24 సినిమాని సూర్య తన సొంత బ్యానర్ అయిన 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అందాల భామ సమంత హీరోయిన్ గా నటిసున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సూర్య ‘సింగం 3’ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు