‘సింగం 3’కి ఎన్టీఆర్‌తో ఉన్న సంబంధం ఇదే!

‘సింగం 3’కి ఎన్టీఆర్‌తో ఉన్న సంబంధం ఇదే!

Published on Dec 5, 2016 12:09 PM IST

singam-3
తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోల్లో ఒకరుగా దూసుకుపోతోన్న సూర్య నటించిన తాజా చిత్రం ‘సింగం 3’ ఈనెల 23న విడుదలవుతోన్న విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాను డిసెంబర్ 16న విడుదల చేయాలనుకున్న టీమ్, ‘ధృవ’ సినిమా కోసం డిసెంబర్ 23కు వాయిదా వేసింది. ఇదే విషయాన్ని సూర్య ప్రెస్‌మీట్ ద్వారా తెలిపారు. ఇక అదేవిధంగా ‘సింగం 3’ ఎక్కువ భాగం వైజాగ్, నెల్లూరులోనే షూటింగ్ జరుపుకుందని, తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత నాయకుడు ఎన్టీఆర్‌తో ఈ సినిమాకు చిన్న సంబంధం ఉందని సూర్య అన్నారు.

అప్పట్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎంజీఆర్ ఇద్దరూ కలిసి ఒక ఇష్యూ కోసం కలిసి పనిచేశారట. ‘సింగం 3’ కథకు ఈ నేపథ్యంతో ఓ చిన్న సంబంధం ఉంటుందని సూర్య తెలిపారు. మాస్ దర్శకుడు హరి తెరకెక్కించిన ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్‌లు హీరోయిన్లుగా నటించారు. సింగం సిరీస్‌లో వచ్చిన గత చిత్రాల్లానే మాస్ యాక్షన్ అంశాలతో సింగం 3 మెప్పించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు