పెటా కు లీగల్ నోటీస్ పంపిన సూర్య !

పెటా కు లీగల్ నోటీస్ పంపిన సూర్య !

Published on Jan 21, 2017 11:25 AM IST

suriya
తమిళనాట ఉదృతంగా సాగిన జల్లికట్టు ఉద్యమానికి సినీ తారలు సైతం కదిలివచ్చి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలా సపోర్ట్ చేసిన స్టార్ హీరోల్లో సూర్య కూడా ఉన్నారు. ముందు నుండి జల్లికట్టుకి సపోర్ట్ చేస్తున్న సూర్య తన తమ్ముడు కార్తితో కలిసి నిన్న జరిగిన జల్లికట్టు నిశ్శబ్ద నిరసనలో పాల్గొన్నారు. దీంతో జల్లికట్టుకి వ్యతిరేకంగా పోరాడుతున్న జంతు సంరక్షణ సంస్థ పెటా హీరో సూర్య కావాలనే వ్యక్తిగత స్వార్థంతో జల్లికట్టుని సపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా ఆయన తరువాతి చిత్రం ‘సింగం 3’ ప్రమోషన్ కోసమే అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది.

ఈ వార్త కాస్త ప్రముఖ వార్తా పత్రికల్లో ప్రచురితమైంది. దీంతో పలువురు సూర్యకు ఫోన్ చేసి ఆ వార్త నిజమేనా అని సూర్యను అడిగారట. దీంతో సూర్య తనపై అలా అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేసిన పెటా సంస్థ సీఈవో పూర్వ జోషిపుర, నికుంజ శర్మ, సచిన్ బంగెర లకు వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా లీగల్ నోటీసులు పంపారు. ఇకపోతే నిన్నటి వరకు ఉదృతంగా జరిగిన జల్లికట్టు నిరసన విజయవంమైంది. ఈరోజు సాయంత్రానికి సుప్రీం కోర్టు జల్లికట్టు ఆమోదానికి అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.

suriya

suriya1

సంబంధిత సమాచారం

తాజా వార్తలు