తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్న సూర్య !

తమిల్ హీరో సూర్య అంటే మొదటి నుండి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేక అభిమానం ఉంది. ఆయన సినిమాలు ఏవి ఇక్కడ అనువాదమైనా వాటికి తెలుగువారి ఆదరణ తప్పక ఉంటుంది. అందుకే సూర్య తన సినిమాలన్నిటినీ తమిళంతో పాటే తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం ఆయన చేసిన ‘తాన సెరెంద కూట్టం’ తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో నిన్న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

దీంతో సూర్య ఇంకాస్త బెటర్ గా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. రేపటి నుండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలు థియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల్ని స్వయంగా కలవనున్నారాయన. ఆయన చేపట్టనున్న ఈ టూర్ పండుగ సీజన్లో సినిమా మైలేజ్ మరింతగా పెరగడానికి తప్పక సహకరిస్తుంది. ఇకపోతే రేపటి నుండి థియేటర్ల సినిమాకు థియేటర్ల సంఖ్య కూడా పెరగనుంది.

 





Like us on Facebook