విక్రమ్ కుమార్ సినిమాకి సూర్య నిర్మాత.!

విక్రమ్ కుమార్ సినిమాకి సూర్య నిర్మాత.!

Published on Jul 24, 2014 9:13 PM IST

Suriya-vikaram-kumar
‘మనం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా ఉంటుందని ఇది వరకే తెలియజేశాం. మాకు అందిన తాజా వార్తల ప్రకారం ఈ సినిమాని సూర్య తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించనున్నాడు. ప్రస్తుతం సూర్య విక్రమ్ ప్రభు దర్శకత్వంలో ‘మాస్’ సినిమాని మొదలు పెట్టాడు. ఈ సినిమాతో పాటు త్వరలోనే విక్రమ్ కుమార్ సినిమాని కూడా మొదలు పెట్టనున్నారు.

తెలుగులో ‘ఇష్క్’, ‘మనం’ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న విక్రమ్ కుమార్ తర్వాత సినిమా అఖిల్ తో ఉంటుందని అన్నారు. కానీ తను మాత్రం సూర్యతో సినిమాని అనౌన్స్ చేసాడు. సూర్య ప్రస్తుతం త్వరలో రిలీజ్ కానున్న అంజాన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఇదే సినిమా తెలుగులో సికందర్ గా రిలీజ్ కానుంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు