సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ’24’ ..!

సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ’24’ ..!

Published on Apr 28, 2016 11:51 PM IST

Suriya-24
సూర్య హీరోగా ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించిన ప్రయోగాత్మక సినిమా ’24’. ఈ సినిమా మే 6 న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సూర్య మూడు పాత్రల్లో నటించారు. ఇందులో హీరోగానే కాకుండా విలన్ గా కూడా మెప్పించనున్నాడు.

మాకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం తమిళంలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది. మరో రెండు మూడు రోజుల్లో తెలుగు సెన్సార్ కి వెళ్లనుంది. దాదాపు 2150 పై చిలుకు థియేటర్స్ లో తెలుగు, తమిళంలో సినిమా విడుదల కానుంది. సూర్య హీరోగా నటిస్తూ తన స్వంత బ్యానర్ పైన నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు