భారీ రిలీజ్‌కు సిద్ధమైన ‘రాక్షసుడు’!

భారీ రిలీజ్‌కు సిద్ధమైన ‘రాక్షసుడు’!

Published on May 27, 2015 4:38 PM IST

Rakshasudu

సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూన్న ‘మాస్’ (రాక్షసుడు) సినిమా భారీ రిలీజ్‌కు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 29న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ‘మాస్’ సినిమా దయ్యం నేపథ్యంలో నడిచే ఓ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. ప్రతీ ఒక్కరినీ అలరించే సరికొత్త స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా తెరకెక్కింది.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల్లో ‘మాస్’ తెలుగు వర్షన్ ‘రాక్షసుడు’ భారీ ఎత్తున విడుదల కానుంది. సూర్యకు తెలుగులో ఉన్న క్రేజ్, వేసవి సెలవులు, థియేటర్ల సంఖ్య ఇలా అన్నీ కలిసి ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ను తెచ్చిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఓవర్సీస్‌లో సైతం తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చగా సినిమా యూనిట్ కూడా భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టి సినిమాను ప్రేక్షకుడి దగ్గరకు తీసుకెళుతోంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, ప్రణీతలు హీరోయిన్లుగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు