రజనీ ‘రోబో-2’ ఆడియో వేడుకకు ముఖ్య అతిథి ఎవరో తెలుసా !


సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ ల కలయికలో రూపొందిన చిత్రం ‘రోబో-2’ ఆడియో వేడుక ఈ నెల 27న దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇంకో మూడు రోజుల్లో జరగనున్న ఈ కార్యక్రమం కోసం నిర్మాణ సంస్థ లేక ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తోంది. ఇండియా నుండి వెళ్లబోయే చిత్ర, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్స్ ను కూడా ఏర్పాటు చేసింది. ప్రతిసారి శంకర్ తన సినిమా ఆడియో వేడుకలకి ఒక పెద్ద స్టార్ ని ఆహ్వానిస్తూ ఉంటారు.

అందుకే ఈసారి ఆ ముఖ్య అతిథి ఎవరై ఉంటారు అనే విషయంలో ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. తమిళ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న వార్తల మేరకు విశ్వనటుడు కమల్ హాసన్ ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా హాజరై పాటల్ని రిలీజ్ చేసే అవకాశముందట. అయితే ఈ వార్తపై రోబో టీమ్ ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ చిత్రం తర్వాత శంకర్ కమల్ తో ‘ఇండియన్-2’ చేయనున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ వేడుకలో ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుండటం మరొక విశేషం.

 

Like us on Facebook