24న రానున్న సూర్య ’24’ ఫస్ట్ టీజర్

24న రానున్న సూర్య ’24’ ఫస్ట్ టీజర్

Published on Feb 8, 2016 7:28 PM IST

24-suriya
విక్రమ్ కుమార్ దర్శకత్వం లో తమిళ హీరో ’సూర్య’ నటిస్తున్న సినిమా ’24’. ఈ మూవీ ఫస్ట్ టీజర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి సారిగా విక్రమ్ కుమార్ దర్శకత్వం లో విభిన్న పాత్రలు ఎంచుకునే సూర్య నటిస్తుండటం, అందులోనూ కథ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కావడంతో తో అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్లు గానే ఫస్ట్ లుక్ లో సూర్య పాత్ర గురించి మూడు విభిన్న షేడ్స్ తో రిలీజ్ చేసిన మూడు పోస్టర్స్ అందరినీ ఆకట్టుకోవడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

ఇప్పుడు తమిళ మీడియా ద్వారా ఆ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ డేట్ గురించి వివరాలు తెలిసాయి. పేరుకు తగ్గట్లుగా ’24’ సినిమా టీజర్ ని ఈ నెల ’24’ విడుదల చేయునున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్ సూర్య కి జోడీగా నటిస్తున్నారు. విక్రమ్ కుమార్ చెప్పిన కథ తనకు బాగా నచ్చడంతో సూర్య తనే స్వంతంగా 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ లో తమిళ నూతన సంవత్సరం రోజున ఈ సినిమా రిలీజ్ కావచ్చని భావిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాని నితిన్ రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు