డైరెక్ట్ తెలుగు సినిమాకి సైన్ చేసిన సూర్య

డైరెక్ట్ తెలుగు సినిమాకి సైన్ చేసిన సూర్య

Published on Aug 1, 2014 8:28 AM IST

surya
తమిళ స్టార్ హీరో సూర్యకి తమిళంలో ఉన్న మార్కట్ లానే తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే తన ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదలవుతుంది. కానీ చాలా రోజుల నుంచి సూర్యని డైరెక్ట్ తెలుగు మూవీ ఎప్పుడు చేస్తారా అని అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకి సూర్య త్వరలోనే తెరదించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం సూర్య ఓ డైరెక్ట్ తెలుగు సినిమాకి సైన్ చేసాడు. కానీ ఎవరు డైరెక్టర్, ఎవరు నిర్మాత అనే విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

సూర్య ప్రస్తుతం తమిళంలో ‘మాస్’ సినిమాని స్టార్ట్ చేసాడు. ఈ సినిమా తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది కాకుండా సూర్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా ‘అంజాన్’ ఆగష్టు 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగులో ‘సికందర్’ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆడియో నిన్న రాత్రి శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించగా, లింగుస్వామి డైరెక్ట్ చేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు