నేడే ‘సూర్య vs సూర్య’ ఫస్ట్ సాంగ్ రిలీజ్

నేడే ‘సూర్య vs సూర్య’ ఫస్ట్ సాంగ్ రిలీజ్

Published on Jan 26, 2015 1:40 PM IST

'Surya-Vs-Surya'
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లోలానే టాలీవుడ్ లో కూడా సరికొత్త పబ్లిసిటీకి శ్రీ కారం చుట్టారు. ఈ మధ్య పలు సినిమాల కార్యక్రమాలు హైదరబాద్ లోనే కాకుండా ఆంధ్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అలాగే సినిమా ఆడియో కంటే ముందే పాటల్ని రిలీజ్చెయ్యడం , వీడియో సాంగ్స్ రిలీజ్ చెయ్యడం లాంటి పలు విభిన్న పబ్లిసిటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే తరహాలో యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న సూర్య vs సూర్య ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి.

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర టీం ఈ సినిమాలోని ఓ ఫుల్ ఆడియో సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ ని మీడియా వారితో పాటు రేడియోలలో కూడా వినిపించనున్నారు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగా మారుతున్న ఈ సినిమాలో త్రిదా చౌదరి హీరోయిన్ గా కనిపించనుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు