సీబీఐ కి సుశాంత్ కేసు, బాలీవుడ్ లో ఏం జరగనుంది?

సీబీఐ కి సుశాంత్ కేసు, బాలీవుడ్ లో ఏం జరగనుంది?

Published on Aug 5, 2020 1:04 PM IST

సుశాంత్ రాజ్ పుత్ తండ్రి కే కే సింగ్ ప్రయత్నం ఫలించింది. సుశాంత్ రాజ్ పుత్ కేసును సీబీఐకి అప్పగిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం సుప్రీం కోర్ట్ కి తెలియజేయడం జరిగింది. తన కొడుకు మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని, సుశాంత్ ఆత్మ హత్య చేసుకునేంత పిరికివాడు కాదని, కే కే సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఈ కేసును సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా బీహార్ ప్రభుత్వం సైతం సుశాంత్ కేసు సిబిఐ కి బదిలీ చేయాలసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. బీహార్ ప్రభుత్వ సూచనలను అంగీకరించిన కేంద్రం సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించారు. సుశాంత్ మరణం కేసులో ముంబై పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, కేసు నుండి కొందరిని ఉద్దేశపూర్వకంగా తప్పించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు