సాంగ్ షూట్ కి సిద్దమవుతున్న స్వాతి ‘త్రిపుర’

సాంగ్ షూట్ కి సిద్దమవుతున్న స్వాతి ‘త్రిపుర’

Published on Jul 28, 2015 8:36 AM IST

swathi
సినీ ఇండస్ట్రీలో ఒక ఫార్మాట్ లో సినిమా హిట్ అయ్యింది అంటే, ఇక అదే ఫార్మాట్ లో పలు సినిమాలు వస్తుంటాయి. అలా రీసెంట్ గా టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఫార్ములా హర్రర్ కామెడీ. గత ఏడాది అంజలి ప్రధాన పాత్రలలో వచ్చిన ‘గీతాంజలి’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి హిట్ అయ్యింది. దాంతో గీతాంజలి టీం ఆ సినిమాకి సీక్వెల్ గా ‘త్రిపుర’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగమ్మాయి స్వాతి ఈ మూవీ టైటిల్ రోల్ లో కనిపించనుంది. ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. త్వరలోనే ఈ చిత్ర టీం హంపి, బదామిలలో రెండు పాటల్ని చిత్రీకరించనున్నారు.

ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ సినిమాకి తమిళంలో ‘తిరుపుర సుందరి’ టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు.
ఆగష్టు రెండవ వారంలోగా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి ఆగష్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదట్లో రిలీజ్ చేసేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. గీతాంజలి సినిమాలానే ఈ సినిమాకి కథ- మాటలు అందించడమే కాకుండా సహా నిర్మాతగా కూడా ప్రముఖ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో కథని మలుపు తిప్పే ఓ కీ రోల్ లో యంగ్ హీరో నవీన్ చంద్ర కనిపించనున్నాడు. చినబాబు – రాజశేఖర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి కూడా గీతాంజలికి దర్శకుడైన రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు