మోషన్ పోస్టర్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టిన చిరు !

మోషన్ పోస్టర్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టిన చిరు !

Published on Aug 23, 2017 6:33 PM IST


నిన్న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ మోషన్ పోస్టర్ అభిమానులని మాత్రమే కాకుండగా తెలుగు ప్రేక్షకులందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. అందులోని విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉండటంతో అందరూ టీమ్ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇక ప్రస్తుతం రికార్డుల్లో భాగంగా చెప్పుకుంటున్న యూట్యూబ్ వ్యూస్ విషయానికొస్తే ఈ మోషన్ పోస్టర్ బ్రహ్మాండమైన వ్యూస్ దక్కించుకుంది

విడుదలైన 24 గంటల్లోనే 1.3 మిలియన్లకు పైగానే వ్యూస్ ను, 47 వేల లైక్స్ ను సాధించిన ఈ మోషన్ పోస్టర్ ఆరంభంలోనే చిరు ఖాతాలో రికార్డును జమచేసింది. మోషన్ పోస్టరే ఇంతలా ప్రభంజనం సృష్టిస్తే టీజర్, ట్రైలర్లు ఎంతలా ఊపేస్తాయోనని అభిమానులు ఇప్పటి నుండే అంచనాలు వస్తూ పాత రికార్డుల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇకపోతే రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుంది అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు