‘సైరా’ హిస్ట‌రీలో నిలిచిపోవాలనే..!

‘సైరా’ హిస్ట‌రీలో నిలిచిపోవాలనే..!

Published on Sep 19, 2019 3:00 AM IST

తెలుగు గడ్డకు చెందిన వీర విప్లవకారుడు “ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి” జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ట్రైలర్ తాజగా విడుదల అయింది. ఇక చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. కాగా ఈ సందర్భంగా సైరా నుండి ఎలాంటి రికార్డుల‌ను అభిమానులు ఆశించ‌వ‌చ్చు? అని పాత్రికేయులు అడిగిన ప్ర‌శ్న‌కు దర్శకుడు సురేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. సైరా సినిమాని రికార్డ్స్ కోస‌మో.. మరో సినిమాను చూసో ఈ సైరా చిత్రాన్ని చేయ‌లేదు. రామ్ చ‌ర‌ణ్‌ గారు న‌న్ను ఒక‌టే అడిగారు. మా డాడీకి నేనొక పెద్ద గిఫ్ట్ ఇవ్వాల‌నుకుంటున్నాను. ఆయ‌న కెరీర్ లో ఈ మూవీ నెంబ‌ర్ వ‌న్ గా ఉండాల‌ని, హిస్ట‌రీలో ఈ సినిమా నిలిచిపోవాలని అనే చెప్పి ఈ సినిమాను స్టార్ట్ చేశారు. స‌ద్దుదేశంతో మెగాస్టార్ కి గిఫ్ట్ ఇవ్వాల‌ని మంచి సంక‌ల్పంతో చేసిన సినిమా కాబ‌ట్టి సైరా ఆ రేంజ్‌ కు వెళ్తుందనుకుంటున్నాను అని తెలిపారు.

కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు