‘సైరా నరసింహారెడ్డి’ షూట్ ఎప్పుడు ఎక్కడ మొదలవుతుందంటే !

‘సైరా నరసింహారెడ్డి’ షూట్ ఎప్పుడు ఎక్కడ మొదలవుతుందంటే !

Published on Sep 20, 2017 6:51 PM IST


మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవితాన్ని తెరపై ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుని మోషన్ పోస్టర్ ను సైతం విడుదల చేసిన చిత్ర టీమ్ అక్టోబర్ 20 నుండి రెగ్యులర్ షూటింగును మొదలుపెడతారని తెలుస్తోంది. హైదరాబాదలోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ వేసిన ప్రత్యేక సెట్లో షూట్ మొదలుకానుంది.

అంతర్జాతీయ స్థాయి సాంకేతికతతో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార వంటి స్టార్లు నటిస్తుండగా ఆస్కార్ విజేత ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఉసురేన్ద్ర రెడ్డి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా కోసం చిరు ఇప్పటికే తన లుక్ ను పూర్తిగా మార్చేసి కెమెరా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు