నైజాంలో సైరా ఏ స్థానంలో నిలిచింది…?

నైజాంలో సైరా ఏ స్థానంలో నిలిచింది…?

Published on Oct 22, 2019 11:24 PM IST

తెలుగు రాష్ట్రాలలో హిట్ టాక్ తెచ్చుకున్న సైరా ముఖ్యంగా నైజాంలో మెరుగైన వసూళ్లు సాధించింది. తాజా సమాచారం ప్రకారం సైరా నైజాంలో ఇప్పటివరకు 27.18 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తుంది. ఐతే ఈ మొత్తం రాంచరణ్ బ్లాక్ బస్టర్ హిట్ రంగస్థలం చిత్ర వసూళ్ల కంటే తక్కువ కావడం గమనార్హం. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం మూవీ నైజాంలో 28.35 కోట్ల షేర్ లైఫ్ టైంలో రాబట్టగలిగింది. ఇక బాహుబలి 2 చిత్రం 63కోట్ల షేర్ తో, బాహుబలి 43కోట్లు, మహేష్ మహర్షి మూవీ 31.5 కోట్లు, సాహో 28 కోట్లతో టాప్ ఫైవ్ లో ఉన్నాయి.

ఇప్పటికీ నైజాంలోని కొన్ని థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సైరా… రంగస్థలం ని అధిగమించి టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకునే అవకాశం కలదు. సైరా ప్రపంచ వ్యాప్తంగా 135కోట్ల షేర్ సాధించింది. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో నయనతార, తమన్నా, అమితాబ్,జగపతిబాబు, సుదీప్,విజయ్ సేతుపతి వంటి స్టార్ క్యాస్ట్ నటించారు. కాగా ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు