కన్నడంలోకి ఎంట్రీ ఇవ్వనున్న తాప్సీ!

కన్నడంలోకి ఎంట్రీ ఇవ్వనున్న తాప్సీ!

Published on Jul 30, 2015 7:30 PM IST

Tapsee-
గత కొంతకాలంగా కేవలం నటిగా తానేంటో నిరూపించుకునే పాత్రలనే ఎంపిక చేసుకుంటూ వెళుతోన్న తాప్సీ, ఆ పాత్రలతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించారు. ఈ కోవలో ఆమె నటించిన బాలీవుడ్ సినిమా ‘బేబీ’, తమిళ సినిమా ‘కాంచన 2’ (తెలుగులో గంగ) సినిమాలు ఆమెకు ఇంతకుముందు ఏ సినిమా తెచ్చిపెట్టని క్రేజ్, గుర్తింపును తెచ్చిపెట్టాయి.

ఇక తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో మెప్పించిన తాప్సీ, తాజాగా కన్నడ సినీ పరిశ్రమలోనూ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నాగ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా ఒకేసారి కన్నడ, తమిళంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. తాప్సీ గతం ఎప్పుడూ చేయని సరికొత్త పాత్రలో నటించనున్నారట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తాప్సీ వరుసగా తమిళ, హిందీ సినిమాలతో బిజీగా గడిపేస్తోన్న విషయం తెలిసిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు