రజనీ సినిమాలో మరొక స్టార్ నటుడు !

రజనీ సినిమాలో మరొక స్టార్ నటుడు !

Published on May 24, 2018 12:25 PM IST

యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తన తర్వాతి సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందులో విజయ్ సేతుపతి లాంటి క్రేజీ నటుడు ప్రతినాయకుడి పాత్రను పోషిస్తుండగా ఇప్పుడు మరొక స్టార్ నటుడు బాబి సింహ కూడ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేయనున్నట్లు తమిళ సినీ వర్గాల సమాచారం.

విజయ్ సేతుపతిలాగనే బాబి సింహ కూడ కార్తిక్ సుబ్బరాజ్ కు మంచి సన్నిహితుడు. వీరిద్దరూ గతంలో ‘జిగర్తాండ, ఇరైవి, పిజ్జా’ వంటి సినిమాల్లో కలిసి పనిచేశారు. ఇకపోతే ఈ చిత్రంలో రజనీకి జోడీగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రన్ నటించనున్నట్లు వార్తలొచ్చాయి. మొదలవడానికి ముందే భారీ అంచనాలను, ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు