ఆ యంగ్ హీరో రియల్ హీరో అనిపించుకున్నాడు !

ఆ యంగ్ హీరో రియల్ హీరో అనిపించుకున్నాడు !

Published on Apr 8, 2020 9:10 PM IST

‘సాయం చేయాలంటే పెద్ద మనస్సు ఉండాలి. అది తనకు ఉందని నిరూపిస్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. తన అభిమాని కడప శ్రీను ఆకస్మిక మరణం తరువాత, అతని కుటుంబానికి అండగా నిలబడుతూ ప్రతి నెల ఆ కుటుంబ ఆర్ధిక అవసరాలు తీరుస్తూ.. ఆ కుంటుబానికి పెద్ద కొడుకుగా మారాడు. ఈ లాక్ డౌన్ క్లిష్ట పరిస్థితుల్లో కూడా, సందీప్ కిషన్ కడప శ్రీను తల్లికి డబ్బులను పంపించారు. కడప శ్రీను తల్లికి ఏ అవసరం ఉన్నా.. ఆమెకు అండగా నిలబడుతూ తానూ రీల్ హీరోతో పాటు రియల్ హీరోనని సందీప్ నిరూపించుకున్నాడు.

ఇక ఈ కరోనా మహమ్మారి పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తన వంతు సాయంగా సందీప్ కిషన్ రూ. 3 ల‌క్ష‌లు విరాళాన్ని అందించిన సంగతి తెలిసందే. అదేవిధంగా తన ‘వివహా భోజనంబు రెస్టారెంట్‌’లో పనిచేస్తున్న 500+ ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలను కూడా సందీప్ కిషన్ ఆర్ధిక సహాయం చేస్తున్నారు.

ఇక `నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో మంచి విజయం సాధించిన సందీప్ కిష‌న్ ప్రస్తుతం `A1 ఎక్స్‌ప్రెస్‌` అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ‘లావణ్య త్రిపాఠి’ నాయిక. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను’ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు