కలిసి నటించనున్న ఇద్దరు టాలెంటెడ్ హీరోలు !
Published on Jul 3, 2017 8:45 am IST


తమిళ సినీ పరిశ్రమలోని హీరోలు మల్టీ స్టారర్ ప్రాజెక్టులు చేయడం సాధారణ విషయమే. కథ, అందులోని పాత్రలు బాగుంటే స్టార్ డమ్ ను పక్కనబెట్టి కలిసి పనిచేస్తారు అక్కడి హీరోలు. ముఖ్యంగా యువ కథానాయకులు ఈవరుసలో ముందుంటారు. ఇప్పటికే కొన్ని మల్టీ స్టారర్ చిత్రాలు సెట్స్ పై ఉండగా మరొక ఇద్దరు యువ హీరోలు కలిసి నటించేందుకు సిద్ధమయ్యారు. వారే జీవా, ఆర్య.

‘నాన్, అమర కావియం, యమన్’ వంటి సినిమాలని రూపొందించిన దర్శకుడు జీవ శంకర్ ఈ సినిమాను డైరెక్టర్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుందట. ఇతర నటీ నటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఇందులో జీవా, ఆర్య ఇద్దరూ హీరోలుగానే నటిస్తారా లేకపోతే ఒకరు హీరోగా, మరొకరు విలన్ గా నటిస్తారా అనే విషయం ఇంకా బయటకురాలేదు.

 
Like us on Facebook