‘బాహుబలి’ కోసం యాక్షన్ మూడ్ లో తమన్నా.

‘బాహుబలి’ కోసం యాక్షన్ మూడ్ లో తమన్నా.

Published on Sep 23, 2014 4:21 PM IST

Tamanna-baahubali
ఇండస్ట్రీలో చాలా రోజుల నుండి అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతున్న తమన్నాఇప్పటి వరకు ఫైటులు, యాక్షన్ సన్నివేశాలలో నటించలేదు. కేవలం రొమాంటిక్ సన్నివేశాలు, పాటలకు మాత్రమె పరిమితమైంది. అయితే ‘బాహుబలి’ కోసం యాక్షన్ మూడ్ లోకి వెళ్ళిపోయింది మిల్కీ బ్యూటీ తమన్నా.

రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమాలో తమన్నా యాక్షన్ సన్నివేశాలలో కనిపించనుంది. వాటి గురించి ఈ అమ్మడు చాలా ఎగ్జైట్ మెంట్ గా ఎదురుచూస్తుంది. తమన్నా ఫైట్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు కూడా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. ఇటివలే డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు